సిద్ధిపేట: పేదలకు సహయం చేయడమే పరమావధిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల తమకు ఆత్మబంధువలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్ధిపేట సిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఫాస్టర్లకు, క్రైస్తవులకు తినిపించారు.
మంత్రి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరిపిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ బీఆర్ఎస్దేనని వెల్లడించారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వమని, అన్నీ కులాలు, మతాలు కలిసి ఉన్న దేశమని తెలిపారు.
సిద్ధిపేట సీఎస్ఐ చర్చి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. నియోజక వర్గాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు.