శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు బుధవారం నిత్య కైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాక్షి గణపతి స్వామివారికి పలు రకాలైన ఉదకాభిషేకాలు పుష్పార్చన చేశారు. అదే విధంగా ప్రధానాలయ ప్రాకారంలో ఉండే అఘోర వీరభద్రస్వామికి మల్లికా గుండంలోని శుద్ధజలాలతో అభిషేకించి షోడశోపచార పూజలు జరిపించారు. అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలు ఇచ్చినట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.