హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : ఈనెల 1నుంచి జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒకరూ పాల్గొనాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ రవాణాశాఖ జనవరి 1 నుంచి 31 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలను అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ టూరిజం పాలసీ ద్వారా సమగ్రాభివృద్ధి సాధించిందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 2025లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో సాధించిన ప్రగతిని, 2026లో సాధించబోయే లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి బుధవారం ఆయన వెల్లడించారు. టూరిజం శాఖ పాలసీలో భాగంగా 2025-30ని అమల్లోకి తెచ్చామని తెలిపారు.