న్యూశాయంపేట, జూన్ 3: తెలంగాణ అమరుల కుటుంబాలకు ప్రతి నెలా రూ.25 వేల చొప్పున పెన్షన్ చెల్లిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. సోమవారం హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగా ణ ఉద్యమకారులను సన్మానించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ అమరుల కుటుంబాలను గౌరవించుకుందామని, వారి కి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఎక్కడా ఉద్యమకారులను అగౌరవపర్చలేదని స్పష్టంచేశారు.
తెలంగాణ ఉద్యమం ఫుట్బాల్ గ్రౌండ్ లాంటిదని, అం దరూ ఆడితేనే రాష్ట్రం వచ్చిందని, అందులో డోల్ కొట్టేవాడికే గుర్తింపు ఉంటుందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేరుస్తామని, వారి త్యాగాలను స్మరించుకోవడం చాలా అవసరమని సూచించారు. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, ప్రభు త్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజ య్య, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శోభారాణి, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.