కూసుమంచి, ఆగస్టు 29 : జీతాలు తీసుకునేందుకైనా పనిచేస్తున్నారా అని జెన్కో సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. పాలేరులోని మినీ హైడల్ జల విద్యుత్తు కేంద్రానికి పూర్తి మరమ్మతులు చేసిన తర్వాత రెండు యూనిట్లలో ఒకటే విద్యుత్తును ఉత్పత్తి చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా పాలేరు పర్యటన సందర్భంగా శుక్రవారం ఆయన జలవిద్యుత్తు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ సిబ్బంది డొల్లతనం బయటపడడంతో ఉన్నతాధికారులను పిలిపించాలని ఆదేశించారు.
ఏళ్లతరబడి మరమ్మతులు చేస్తే ఉత్పత్తి జరిగేది ఎప్పుడు? అసలు మీరు పనిచేస్తున్నారా? లేదా? అంటూ జెన్కో సిబ్బందిపై మండిపడ్డారు. గత ఏడాది వచ్చిన వరదలతో మరమ్మతులకు గురైన జల విద్యుత్తు కేంద్రానికి రూ.6 కోట్లతో మరమ్మతులు చేశారని తెలిపారు. 20 రోజుల క్రితం విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించగా.. కొద్ది రోజులకే మళ్లీ ఒక యూనిట్లో సాంకేతిక లోపంతో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోవడం ఏమిటని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించాలని ఆదేశించారు.
మంచిర్యాల, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకరేమో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.. మరొకరేమో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మె ల్యే ప్రేమ్‌సాగర్‌రావు.. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే. కానీ మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌లోని ఓరియం ట్ సిమెంట్ (అదానీ) కంపెనీ గుర్తింపు కార్మి క సంఘం ఎన్నికల్లో ఈ ఇద్దరు నాయకులు తలపడ్డారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి మంత్రి వివేక్ బెల్లంపల్లిలో ప్రెస్‌మీట్ పెట్టి కాసిపేట మాజీ ఎంపీపీ విక్రమ్‌రావు కాంగ్రెస్ అభ్యర్థి అని ప్రకటించారు.
ఇదే సమయంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తమ్ముడు కొక్కిరాల సత్యపాల్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి పార్టీలకు అతీతంగా పోటీలో ఉంటానంటూ స్పష్టం చేశారు. దీంతో ఓ వైపు మంత్రి.. మరోవైపు మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే పీఎస్ఆర్ మధ్య పోటీ అనివార్యంగా మారింది. ఇరు వర్గాల మధ్య జరిగిన పోరు లో.. మంత్రి వివేక్, ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు బలపరిచిన అభ్యర్థి విక్రమ్రావుకు 108 ఓట్లు రాగా.. పీఎస్ఆర్ త మ్ముడు సత్యపాల్రావుకు 141 ఓట్లు వ చ్చాయి. మరో అభ్యర్థి తట్రా భీంరావ్కు 6 ఓట్లు పడగా, ఒక్క ఓటు చెల్లకుండా పోయిం ది. దీంతో పీఎస్ఆర్ తమ్ముడు సత్యపాల్‌రావు 33 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పీఎస్ఆర్ వర్గం గెలవడంతో మంత్రి వివేక్ వర్గానికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.