హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ భూముల పరిరక్షణతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడంలో రెవెన్యూ యంత్రాం గం పాత్ర కీలకమని తెలిపారు. కేరళ మంత్రి రాజన్‌తో మంత్రి పొంగులేటి శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేరళలో అమలవుతున్న హౌసింగ్ సీమ్తోపాటు రెవెన్యూ విభాగం పనితీరు పొంగులేటి అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ నేతలు ఔదార్యం చాటుకున్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి రూ.5 లక్షల చెకును తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రావుకు శనివారం అందజేశారు. తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాములు, రమేశ్పాక, సెక్రటరీ జనరల్ ఫుల్సింగ్హన్ తదితరులు పాల్గొన్నారు.