పెద్దపల్లి, మే 20(నమస్తే తెలంగాణ)/ సైదాపూర్, ఏప్రిల్ 20: భూ భారతి తో భూ సమస్యలు పరిషారం అవుతాయని రెవెన్యూ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మం డలం ఘనపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి భూభారతి రెవెన్యూ సదస్సులకు హాజరై, ఆయాచోట్ల మాట్లాడారు.
లైసెన్స్డ్ సర్వేయర్లను ఈనెల 27వరకు ఫైనల్ చేస్తామని, 3నెలలు శిక్షణ ఇచ్చి ప్రతి మండలానికి నియమి స్తామని చెప్పారు. అర్హులైన పేదలందరినీ ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దేశ సరిహద్దుల అం శంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.