రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : పవర్‌లూం కార్మికులతోపాటు వార్పింగ్, వైపని, ఆసాముల కూలి అగ్రిమెంట్ జరిగేవరకు సమ్మె కొనసాగిస్తామని ప వర్లూమ్ వరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ పేర్కొన్నారు. సోమవారం పాలిస్టర్ పవర్లూమ్, వార్పింగ్, వైపని కార్మికుల, ఆసాముల సమ్మె సందర్భం గా సీఐటీయూ కార్యాలయ ప్రాంగణంలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మూషం రమేశ్ మాట్లాడుతూ.. కార్మికులు, ఆసాములకు కూలి పెంచాలని యజమానులకు ఎన్నోరోజుల నుంచి అడుగుతున్నా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మిక సమస్యలను కలెక్టర్‌తోపాటు లేబర్ కమిషనర్, చేనేత, జౌళి శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శనివారం యజమానులు చర్చలకు పిలిచారని చెప్పారు.
ఈ చర్చల్లో కేవలం పవర్లూమ్ కార్మికులు, ఆసాముల కూలిపై మాత్రమే చర్చించారని, వా ర్పింగ్, వైపని కార్మికుల విషయంలో వాయిదావేశారని వాపోయారు. పవర్లూమ్ కార్మికులకు 10 పీకులకు 28 పైసలు ఇస్తామని యజమానులు ఒప్పుకొన్నప్పటికీ అగ్రిమెంట్ చేయలేదని చెప్పారు. కాలయాపన చేయకుండా వార్పింగ్, వైపని కూలి పెంచాలని, ఆసాముల అదనపు కూలి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు సమ్మె విరమించబోమని స్పష్టంచేశారు. కార్యక్రమం లో సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కోడం రమణ వార్పిన్. యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపని యూనియన్ అధ్యక్షుడు కుమ్మరి కుంట కిషన్, పవర్లూమ్ యూనియ న్ నాయకులు కుడిక్యాల కనకయ్య, ఉడుత రవి, ఎలిగేటి శ్రీను, సబ్బని చంద్రకాంత్, బాస శ్రీధర్, గడ్డం రాజశేఖర్, బేజిగం సురేశ్, సర్గం శేఖర్, గోవిందు లక్ష్మణ్ పాల్గొన్నారు.