హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను సో మవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 29,720 మం ది ఉపాధ్యాయులు ఓటు హకు వినియోగించుకోనున్నారు. 137 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
బరిలో ఉన్న అభ్యర్థులు వీరే
ఏ వెంకటనారాయణరెడ్డి(ఏవీఎన్‌రెడ్డి), ఎల్ వెంకటేశ్వర్లు, అన్వర్‌ఖాన్, అయినేని సంతోష్‌కుమార్, కే సాయన్న, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కే ప్రభాకర్, డాక్టర్ జీ వెంకటేశ్వర్లు, జీ హర్షవర్ధన్‌రెడ్డి, గుర్రం చెన్నకేశవరెడ్డి, సీ చంద్రశేఖర్, సీ పార్వతి, అన్నత్ నారాయణ్, డీ మల్లారెడ్డి, డాక్టర్ వీ నథానియల్, పాపన్నగారి మాణిక్‌రెడ్డి, బీ భుజంగరావు, ఎం తిరుపతి, లక్ష్మీనారాయణ మారంపల్లి, ఎస్ విజయకుమార్, ఏ వినయ్‌బాబు ఎన్నికల బరిలో నిలిచారు.
నేడు ఉపాధ్యాయులకు ఆప్షనల్ హాలీడే
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయులందరికీ సోమవారం ఆప్షనల్ హాలీడేను ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులం తా ఎన్నికలో పాల్గొనే అవకాశం దక్కింది. ఎన్నికల సందర్భంగా విద్యాసంస్థలకు గైర్హాజరు కాకుండా ఉండేందుకు.. ఈ హాలీడే ఉపయోగపడనున్నది.