హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రయాణంలో ప్రకృతి పిలిస్తే పరుగెత్తకుండా ఎవరుంటారు? అర్జెంట్‌గా వస్తుందని ప్లాస్టిక్ బాటిల్‌తో పనికానిచ్చేసిన ఓ వ్యక్తికి అటవీ అధికారులు షాక్ ఇచ్చారు. అడవిలోకి ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకెళ్లినందుకు ఏకంగా రూ. 2వేలు జరిమానా విధించారు. మహారాష్ట్రకు చెందిన దినేశ్ మంగళ్ మంగళవారం శ్రీశైలం రోడ్డు వెంట బైక్‌పై వెళ్తుండగా అర్జెంటుగా ప్రకృతి పిలిచింది.
రోడ్డు పకన బండి ఆపేసి .. వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని తుప్పల చాటుకెళ్లి భారం దించేసుకున్నాడు. హమ్మయ్యా.. అనుకునేలోపే అటవీ అధికారులు ప్రత్యక్షమయ్యారు. అడవిలోకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకెళ్లినందుకు తిట్లతోపాటు .. రూ.2వేల ఫైన్ కూడా వేశారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన ట్విస్ట్‌తో.. అవాకవటం బాధితుడి వంతైంది. శ్రీశైలం ఫారెస్ట్ (అమ్రాబాద్ ఫారెస్ట్) టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావటంతో .. ఎకడ పడితే అకడ బండ్లు ఆపనివ్వరు. పైగా.. ఈ అడవిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టిక్ బాటిల్‌ను అడవిలోకి తీసుకెళ్లినందుకే ఫైన్ వేసినట్టు పోలీసులు తెలిపారు.