జగిత్యాల (Jagtial District) జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ ఇవాళ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఎస్పీ సింధు శర్మ (SP Sindhu sharma) మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతోపాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగాని ఎస్పీ సింధు శర్మ (ఐపీఎస్) దిశానిర్దేశం చేశారు.