వికారాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): లగచర్ల ఘటనలో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి మంగళవారం వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 2న విచారణకు హాజరుకావాలని సూచించారు. లగచర్ల ఘటనలో బెయిల్‌పై వచ్చిన వారితోపాటు రిమాండ్‌లో ఉన్న కొంతమంది రైతులపై క్రైం నంబర్ 145 కింద మరో కేసు ఉండటంతో పోలీసులు రై తులను అరెస్ట్ చే యాలని భావిస్తున్న ట్టు తెలిసింది.
దుద్యాల మండలం లో ఫార్మా విలేజ్ ఏ ర్పాటుకు వ్యతిరేకం గా రైతులు ఆరేడు నె లలపాటు ఉద్యమించారు. భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం లాక్కొని కంపెనీలు ఏర్పాటు చేస్తుందన్న దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడిపై రైతులంతా దాడిచేశారు. ఈ ఘటనలో నరేందర్ రెడ్డితోపాటు ఏడుగురు రైతులపై బొంరాస్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. లగచర్ల కేసు తర్వాత మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారనే సమాచారంతో సదరు రైతుల కుటుంబాలను భయం వెంటాడుతున్నది.