సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో(Suryapet) నకిలీ విత్తనాలు,(Fake seeds) నిషేధిత గడ్డిమందును పోలీసులు పట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 52 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, మూడు లక్షల రూపాయల విలువగల 300 లీటర్ల నిషేధిత గడ్డి మందులను స్వాధీనం(Police seized) చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డిమందునక్విక్రయిస్తున్న సంకేపల్లి సోమిరెడ్డి(53 ), గుగులోత్ ప్రేమ్ కుమర్ (29) అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. అలాగే అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడూరు గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని 22 కిలోల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశారని తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. అన్నదాతను నమ్మించి మోసం చేసి నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైన నకిలీ విత్తనాలను, విక్రయించినా, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.