హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఈ ఏడాది తప్పిపోయిన, అక్రమ రవాణాకు గురైన 3,076 మంది పిల్లల్ని రక్షించినట్టు పోలీసులు తెలిపారు. శుక్రవారం వివరాలు వెల్లడించారు. 2,772 మంది అబ్బాయిలు, 304 మంది అమ్మాయిలు ఉన్నట్టు తెలిపారు.
రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్న 115 పిల్ల ల్ని రక్షించినట్టు చెప్పారు. దర్పన్ యాప్‌తో 87శాతం మంది పిల్లల్ని రక్షించగా, వారిలో 2856 మందిని తల్లిదండ్రులకు అప్పగించినట్టు వెల్లడించారు. మరో 220 మందిని రెస్క్యూ హోంకు తరలించగా, 281 మంది ని పాఠశాలల్లో చేర్పించామని తెలిపారు.