మిడ్జిల్, సెప్టెంబర్ 11: దుందుభీ వాగులో ఇద్దరు మహిళలు చిక్కుకొని ఆర్తనాదాలు చేయగా.. పోలీసులు వారి ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుం దుభి వాగు పారుతున్నది. సోమవారం గ్రామానికి చెందిన సుగుణమ్మ, నీలమ్మ వాగు అవతల ఉన్న ఆవంచ గ్రామంలో సంతకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వాగు ఉధృతి పెరగడంతో ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. వాగు మధ్యలో ఉన్న ముళ్ల చెట్టును పట్టుకొని కేకలు వేశారు.
అటుగా వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రెవెన్యూ, పోలీసు, ఫైర్, రెస్క్యూ టీమ్ గ్రామస్థుల సహకారంతో కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. ఫలితం లేకపోవడంతో మరబోటు తెప్పించి అందులో సీఐ జములప్ప, బో టు సిబ్బందితో కలిసి మహిళలు ఉన్న చోటుకు వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాదాపు 7 గంటలపాటు మహిళలు నీటిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నా రు. నీటిలో కొట్టుకుపోకుండా వారి చీర కొంగులను చెట్టుకు కట్టుకున్నారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది.