Nennela | ధాన్యం కొనాలని రోడ్డెక్కిన రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు
కష్టపడి పండించి పంటలను కొనాలని కోరడమే కాంగ్రెస్ పాలనలో నేరమవుతున్నది. ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులపై పోలీసులు కుట్రపూరితంగా కేసులు నమోదు చేసస్తున్నారు
నెన్నెల : కష్టపడి పండించి పంటలను కొనాలని కోరడమే కాంగ్రెస్ పాలనలో నేరమవుతున్నది. ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులపై పోలీసులు కుట్రపూరితంగా కేసులు నమోదు చేసస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో గత నెల 20న ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన రైతులపై పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా కేసులు నమోదు చేశారు. నెల రోజులైనా కాంట వేయడం లేదని కాంట అయిన బస్తాలను తరలించడం లేదని ఆరోపిస్తూ గొల్లపల్లిలో రోడ్డుపై ధాన్యం బస్తాలతో నిరసన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచన, నెన్నెల ఎస్ఐ రామకృష్ణ రైతులను సముదాయించి ఆందోళన విరమింప చేయడానికి యత్నించారు.
అంతకు ముందు రైతులకు తహసిల్దార్ సైతం ధాన్యం కాంట చేసి లారీలను పంపుతామని ఫోన్లో చెప్పడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. అంతా అయిపోయిందని రైతులు భావించారు. కానీ పోలీసులు మాత్రం రైతులపై గుట్టుచప్పుడు కాకుండా మూడు వారాలు దాటాక ఆరుగురు రైతులపై కేసు నమోదు చేసారు. చింత పురుషోత్తం, జాడి నారాయణ, గడ్డం తిరుపతి గౌడ్, చింత సురేష్, ఇందూరి రమేష్, వేల్పుల మొగిలి పై 126(2),221,292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. చింత సురేష్ స్థానికంగా లేకున్నా పోలీసులు ఆయన పై కేసు పెట్టారు. పోలీసులు రైతులపై అక్రమ కేసులు పెట్టడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుననాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

