హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల (BRS leaders) నివాసాల వద్ద పోలీసులు (Police) మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR), రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు.
ఇదిలావుంటే హెచ్సీయూ వద్ద ఆందోళనకు దిగిన బీజేవైఎం, సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చికోటి ప్రవీణ్ సహా పలువురు నేతలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. పరిస్థితి అదుపుతప్పకుండా హెచ్సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
కాగా కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్ దాఖలైంది. కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ వట ఫౌండేషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అత్యవసర విచారణకు స్వీకరించాలని ఫౌండేషన్ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై బుధవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
KTR slams Rahul Gandhi, questions double standards as police deploy at his residence
Amid protests by Hyderabad Central University (HCU) students against environmental destruction on 400 acres of campus land, police were deployed outside the residence of BRS Working President… pic.twitter.com/bIZyjAy8K9
— TeluguScribe Now (@TeluguScribeNow) April 1, 2025
కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
HCUలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో, వారికి మద్దతుగా వెళ్తారన్న అనుమానంతో కేటీఆర్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు pic.twitter.com/G3JJKM1phq
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2025