హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాలుగేండ్ల నుంచి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడంతోపాటు బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్టు బాధితురాలు ఆరోపిస్తున్నందున పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఆయనను 7 రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో కోరారు. దీనిపై కోర్టు ఒకట్రెండు రోజుల్లో తీర్పు వెలువరించే అవకాశం ఉన్నది.