Kodangal | హైదరాబాద్ : దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడిన సంగతి తెలిసిందే. సీఎం కొడంగల్‌కు వస్తున్నారని చెప్పి.. గురువారం రాత్రి పరిగి – కొడంగల్ చౌరస్తా వద్ద గంటల తరబడి పోలీసులు ట్రాఫిక్‌ను ఆపేశారు. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రయాణికులను, వాహనదారులకు సముదాయించే ప్రయత్నం చేశారు. మీకు దండం పెడుతా కాసేపు ఓపిక పట్టండి అని వాహనదారులను వేడుకున్నారు ఆ పోలీసు ఉన్నతాధికారి.
ఇక ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దాదాపు గంట అయింది.. రేవంత్ రెడ్డి కోసం ఎంతసేపు ఆపుతారు? అని పోలీసులను నిలదీశారు. పండగ పూట కొడంగల్ జనాలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయినా కూడా పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకోకుండా గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపేయడం సరికాదన్నారు. రాత్రి 10 గంటలు అవుతున్నా తమను రోడ్లపై నిలబెట్టడం సరికాదని పోలీసుల తీరుపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి కలగజేసుకుని.. మీకు దండం పెడుతాము.. మేము కూడా అన్నీ వదులుకొని ఇక్కడే రోడ్డు మీద ఉన్నాము అంటూ జనాలకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజలు శాంతించలేదు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మీకు దండం పెడతాం కాసేపు ఓపిక పట్టండి!
దాదాపు గంట అయింది.. రేవంత్ రెడ్డి కోసం ఎంతసేపు ఆపుతారు?
పండగ పూట కొడంగల్ జనాలను ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి
సీఎం వస్తున్నాడని ట్రాఫిక్ ఆపిన పోలీసులు.. ఎంత సేపు ఆపుతారు అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కొడంగల్ ప్రజలు
దసరా పండగ రోజు… https://t.co/g5NXyYHOn9 pic.twitter.com/kyzCXgqAdl
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2025