బాల్కొండ, ఆగస్టు 21: రుణమాఫీ పేరిట రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ గురువారం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలకు ప్రభుత్వం తెరలేపింది. ధర్నాలకు వెళ్లొద్దని పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేయిస్తున్నది. ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వ అనుమతి లేదని, ఒకవేళ ఆ కార్యక్రమానికి వెళ్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు జారీ చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నదాతలకు అండగా చేపట్టే ఈ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు ఆదేశించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.