త్వరలో పోలీస్ నిరుద్యోగ జేఏసీ బస్సుయాత్ర!
యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పోలీసు కొలువుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్టు పోలీసు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆదివారం తెలిపారు.
- యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌కు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పోలీసు కొలువుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్టు పోలీసు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆదివారం తెలిపారు. ఆ మూడు జిల్లాల పోలీసు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు తక్షణం 3,200 పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోలీసు ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని జేఏసీ ప్రతినిధి ఆకాశ్ పేరొన్నారు. నిరుద్యోగుల సమస్యలపై హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జి ల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపడుతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

