హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కేవలం పదేండ్లలో వం దేండ్ల అభివృద్ధిని తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ పరిచయం చేశారని, ఆయన రాక కోసం యావత్ దేశం ఎదురుచూస్తున్నదని పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు.
కేసీఆర్ దార్శనికత వల్లే రాష్ట్రం అభివృద్ధిబాటలో పయనిస్తున్నదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో మహోజ్వలమై వెలుగుతున్న తెలంగాణ వైపు దేశం చూస్తున్నదని కొనియాడారు. తెలంగాణ సాధించిన విజయాలను సబ్బండవర్గాలు దశాబ్ది ఉత్సవాల రూపంలో జరుపుకుంటున్నారని తెలిపారు. దేశం అనాథ మాదిరిగా పరిపాలనాదక్షుడైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నదని, ఈ క్లిష్టపరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెకించడం కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు.