సూర్యాపేట, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ విప్, దోర్నకల్ శాసన సభ్యుడు డాక్టర్ రామచంద్రనాయక్పై భూవివాదంలో సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గుండపునేని లక్ష్మీనర్సింహారావు (సుధాకర్‌రావు) తన స్థలంలో చెత్తను తొలగిస్తూ ఫెన్సింగ్ చేసుకుంటుండగా రామచంద్రనాయక్ అడ్డుకున్నాడు. దీంతో లక్ష్మీనర్సింహారావు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చారు. పోలీసులు సివిల్ మ్యాటర్లో తలదూర్చుతున్నారని ప్రభుత్వ విప్ కోర్టును ఆశ్రయించారు. లక్ష్మీనర్సింహారావు డయల్ 100కు కాల్ చేయడంతో తాము ఘటనా స్థలానికి చేరుకున్నామని, దౌర్జన్యం చేసిన ఘటనలో కేసు నమోదైందని, అందులో ఏ1గా బాషపంగు భాస్కర్, ఏ2గా డాక్టర్ రామచంద్రనాయక్ ఉన్నారని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇదే భూమి విషయంలో 2016లో కూడా రాంచందర్‌నాయక్‌పై కేసు నమోదైంది.