Allu Arjun | అల్లు అర్జున్‌తో ‘ధురంధర్’ దర్శకుడు భారీ ప్రాజెక్ట్?.. ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.!
Allu Arjun | 'ఉరి', 'ధురంధర్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాలీవుడ్ మేకింగ్ స్టైల్‌ను మార్చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్, తన తదుపరి భారీ చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం.
Allu Arjun | ‘ఉరి’, ‘ధురంధర్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాలీవుడ్ మేకింగ్ స్టైల్‌ను మార్చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్, తన తదుపరి భారీ చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఆదిత్య ధర్ తన కలల ప్రాజెక్ట్ (Dream Project) కథను ఇటీవల అల్లు అర్జున్‌కు వివరించినట్లు, దానికి బన్నీ కూడా సానుకూలంగా స్పందించినట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని, 2026 మార్చిలో ‘ధురంధర్ 2’ విడుదలైన తర్వాతే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఈ క్రేజీ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండటంతో చిత్ర బృందం స్పందిస్తూ ఇవన్నీ కేవలం పుకార్లేనని, అధికారికంగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని ప్రాథమికంగా వెల్లడించింది. అయినప్పటికీ.. ఒక టాలెంటెడ్ డైరెక్టర్ మరియు గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ కలిస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, ఇది భారతీయ సినిమాలోనే అతిపెద్ద యాక్షన్ డ్రామాగా నిలిచే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

