శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 29: గచ్చిబౌలి ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీకి డ్రగ్స్ సప్లయ్ చేసిన నగరానికి చెందిన మీర్జావహీద్ బేగ్‌తోపాటు వివేకానందకు డ్రగ్స్ చేరవేసిన అతని డ్రైవర్ గద్దల ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. ఈ ఇద్దరు సహా ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు అరెస్ట్ అయ్యారు.
ఈ కేసులో ఏ1గా ఉన్న మంజీరా గ్రూప్ డైరెక్టర్ గజ్జెల వివేకానందకు డ్రగ్స్ చేరవేసిన అతని డ్రైవర్ గద్దల ప్రవీణ్‌తోపాటు పార్టీకి డ్రగ్స్ అందించిన సప్లయర్ సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీకి కొకైన్ ఇచ్చిన మరో నిందితుడు పాతబస్తీకి చెందిన మీర్జావహీద్ బేగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వహీద్ నుంచి అబ్బాస్ కొకైన్ తీసుకొని డ్రైవర్ ప్రవీణ్ ద్వారా వివేకానందకు చేరవేసినట్టు పోలీసుల
విచారణలో వెల్లడయ్యింది.