బీఆర్ఎస్ కార్యకర్తపై పోలీసుల ఉక్కుపాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త న్యాత సురేశ్ అనే దివ్యాంగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం విషయంలో పోలీసులు పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
- సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ అరెస్ట్
చందుర్తి, జూన్ 21 : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త న్యాత సురేశ్ అనే దివ్యాంగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం విషయంలో పోలీసులు పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పలు వార్తాకథనాలను న్యాత సురేశ్ వైరల్ చేస్తున్నారంటూ తమకు ఫిర్యాదులు అందాయని వేములవాడ పట్టణ పోలీసులు ఆదివారం రాత్రి బండపల్లికి వెళ్లి సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దివ్యాంగుడని కూడా చూడకుండా వేములవాడ పోలీస్‌స్టేషన్ తరలించగా, పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని నిరసన తెలిపారు. దీంతో సురేశ్‌ను సొంత పూచీకత్తుతో విడుదల చేశారు.
దళిత, గిరిజనులను కాంగ్రెస్ మోసగించింది
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్ నాయక్
హైదరాబాద్, జూన్21 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బస్సుయాత్ర పేరిట మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ముడావత్ రాంబల్‌నాయక్ మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. బస్సుయాత్ర పేరిట ప్రజ ల దగ్గరికి వస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలో కి వచ్చి 30 నెలలైనా దళిత గిరిజనులకు ఇచ్చిన ఒక హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. చేవెళ్ల డిక్లరేషన్ అమలు సంగతేమో కానీ.. ఉన్న పథకాలకు కూడా నిధులు ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. అమాయకులపై అక్రమంగా కేసులను బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను అమలు చేయకుండా గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

