హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చదువుతున్నారని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని రమేశ్ చేసిన వ్యాఖ్యలను ఖండి స్తూ శుక్రవారం ఆయన బంజారాహిల్స్ పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. అనంతరం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తమ నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. అయినప్పటికీ రమేశ్ అబద్ధా లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పచ్చి అవినీతిపరుడని, ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులకు రూ. 450 కోట్లు ఎ గ్గొట్టారని ఆరోపించారు. కంచగచ్చబౌలి భూ ముల విషయంలో కాంగ్రెస్ సర్కారుకు సీఎం రమేశ్ బ్రోకర్‌గా పనిచేశారని విమర్శించారు.
రాష్ట్రంపై సీమాంధ్రుల పెత్తనం
20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను దోచుకుంటున్నారని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డే చెప్పారని గుర్తుచేశారు. కాంట్రాక్టుల కోసమే సీఎం రమేశ్ బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్న ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తే హైదరాబాద్‌లో తిరగనివ్వబోమని హెచ్చరించారు.