శేరిలింగపల్లి, ఫిబ్రవరి 1: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ప్రిజమ్ పబ్‌లో ఓ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పబ్ వద్ద మాటువేసిన పోలీసులు వీరాస్వామి, వెంకట్‌రెడ్డి, ప్రదీప్.. 80 కేసుల్లో నిందితుడు ప్రభాకర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు తుపాకీతో పోలీసులపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి కాలు నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. మిగిలినవారు ప్రభాకర్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి 2 తుపాకులు, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఘటన స్థలాన్ని మాదాపూర్ డీసీపీ వినీత్, ఏడీసీపీ జయరామ్, ఏసీపీ శ్రీకాంత్ పరిశీలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న వెంకట్‌రెడ్డిని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి పరామర్శించారు.