నిజామాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కాన్వాయ్‌ని పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. (Police checked) ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పర్యటిస్తున్న కవిత వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను(Election Code) అనుసరించి పోలీసులకు ఎమ్మెల్సీ కవిత పూర్తిగా సహకరించారు. ఆమె వాహనంతో పాటు తన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన ఎమ్మెల్సీకి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.