ఇందూరు, అక్టోబర్ 11: చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న బెదిరింపుల ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. డబ్బుల కోసం ఓ ఇసుక వ్యాపారిని బెదిరించిన ఘటనలో తీన్మార్ మల్లన్న, తెలం గాణ సామాజిక పోరాట సమితి అధ్యక్షుడు ఉప్పు సంతోష్‌పై నిజా మాబాద్‌లో మరో కేసు నమోదైంది. ఓ కల్లు వ్యాపారిని బెదిరించిన ఘటనలో గత నెలలో వీరిద్దరిపై ఎడపల్లిలోనూ ఓ కేసు నమోదైంది. నిజా మాబాద్ నాల్గో టౌన్ ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడేండ్ల క్రితం తాను అధ్యక్షుడిగా తెలంగాణ సామాజిక పోరాట సమితి పార్టీని ఉప్పు సంతోష్ ఏర్పాటుచేశాడు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్నతో కలిసి ఆయన కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన బాలరాజ్‌గౌడ్ అనే ఇసుక వ్యాపారిని బెదిరించాడు. తన పార్టీకి 20 లక్ష లు ఇవ్వాలని సంతోష్, తాను కొత్తగా పెట్ట బోయే చానల్‌కు 5 లక్షలు ఇవ్వా లని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశా డని బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉప్పు సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.