మాజీ సర్పంచ్ దంపతులపై పోలీసుల దౌర్జన్యం
పెండింగ్ బిల్లుల కోసం పాఠశాలకు తాళం వేసిన మాజీ సర్పంచ్ దంపతులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపటలో చోటుచేసుకున్నది.
- బిల్లుల కోసం బడికి తాళంవేసిన దంపతులను ఈడ్చుకెళ్లిన వైనం
- గాయపడిన మాజీ సర్పంచ్
ఇల్లంతకుంట రూరల్, ఏప్రిల్ 17: పెండింగ్ బిల్లుల కోసం పాఠశాలకు తాళం వేసిన మాజీ సర్పంచ్ దంపతులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపటలో చోటుచేసుకున్నది. వల్లంపట్ల మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ-వెంకటనర్సింహారెడ్డి దంపతులు బీఆర్ఎస్ హయాంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.45 లక్షలతో రెండు తరగతి గదులు, వంటశాల నిర్మాణం చేపట్టారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ రెండేండ్ల నుంచి అధికారుల వద్దకు వెళ్లి ప్రాధేయపడినా కనికరించలేదు. ఈ క్రమంలో రూ.22లక్షల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరుతూ గురువారం పాఠశాలకు తాళంవేశారు. హెచ్ఎం శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి పాఠశాల తాళాలు పగులగొట్టారు.
శుక్రవారం మాజీ సర్పంచ్ దంపతులిద్దరూ పాఠశాలకు వెళ్లి తాళం వేసి నిరసనకు దిగారు. ఎంఈవో శ్రీనివాస్ చేరుకుని డీఈవోకు ఫోన్ చేసి మాజీ సర్పంచ్ దంపతులతో మాట్లాడించారు. తమపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటేనే తాళాలు తీస్తామని వారు స్పష్టంచేశారు. కాంగ్రెస్ సర్పంచ్ ఒత్తిడి మేరకు ఎస్ఐ వచ్చి మాజీ సర్పంచ్ దంపతులను బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనంలో ఎక్కించారు. పోలీసులు ఈడ్చుకెళ్తున్న క్రమంలో కేతిరెడ్డి అనసూయ చేతి గాజు పగిలి గీసుకుపోవడంతో తీవ్ర గాయమైంది. సాయంత్రం వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

