సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 00:39:50

నకిలీ దేవరకొండ విజయ్‌ అరెస్ట్‌

నకిలీ దేవరకొండ విజయ్‌ అరెస్ట్‌
  • హీరో క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలనే తాపత్రయం
  • విజయ్‌నంటూ సోషల్‌మీడియాలో ఫోన్‌ నంబర్‌
  • సైబర్‌క్రైం విచారణతో నకిలీ వ్యవహారం బట్టబయలు
  • పట్టుకోవడంలో సహకరించిన హీరో బృందం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సినిమా హీరో విజయ్‌ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా, వాట్సప్‌ నంబర్లను వాడుతూ గుర్తుతెలియని వ్యక్తి చాటింగ్‌ చేస్తున్నాడని, ఇది తన ఇమేజ్‌కు భంగం కలిగించేదిగా ఉందంటూ రెండ్రోజుల క్రితం సైబర్‌క్రైం పోలీసులకు విజయ్‌ దేవర్‌కొండ మంగళవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకొన్న ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు బృందం పథకం ప్రకారం నిందితుడిని హైదరాబాద్‌ రప్పించి అదుపులోకి తీసుకోవడంతో నకిలీ విజయ్‌ దేవరకొండ వ్యవహారం బట్టబయలైంది. 


నిజామాబాద్‌ జిల్లా మిర్జాపూర్‌కు చెందిన సాయికృష్ణ పదో తరగతి వరకు చదివి అక్కడే ఇడ్లీ బండి నిర్వహిస్తున్నాడు. అతన్ని పట్టుకొనేందుకు సైబర్‌క్రైం పోలీసులు నకలీ మహిళను సృష్టించి  గురువారం రాత్రి ఎల్బీనగర్‌కు వచ్చి క్యాబ్‌ కోసం ఎదురు చూస్తుండగా అక్కడే కాపుకాసిన సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సాయికృష్ణపై సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీచేసి ఆయన కుటుంబీకులకు అప్పగించారు. 


logo