హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 1553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి సోమవారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, పోల్ క్లెంబింగ్ పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు విద్యుత్ శాఖ వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. నిరుడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పటికే రాత పరీక్షను పూర్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరడంలో ఉద్యోగాలిప్పిస్తామని దళారులు వచ్చే అవకాశం ఉన్నదని, వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. నిర్ణీత అర్హతలు ఉండి, పోల్క్లెంబింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనుసరించి అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు.