కరీంనగర్, మే 10 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి సాయిభగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయంతెలిసిందే. ఈ వివాదం మరింత ముదురకుండా చూసుకోవాలన్న లక్ష్యంతో బండి రాజీ కోసం రాయబారం నడుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తే బాధిత కుటుంబంసభ్యులు మాట్లాడటం లేదని గమనించిన బండి బాలికకు దగ్గరి బంధువులను ఎంపిక చేసి.. వారితో రాజీకోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తున్నది. బాధిత కుటుంబం వద్ద ఉన్న వీడియోలు, ఆడియోలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం. కొంతమంది రెచ్చగొట్టడంవల్లనే పోలీసుస్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చిందని ఫిర్యాదుదారుల ద్వారా చెప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిసింది. బాధిత కుటుంబం మాత్రం రాజీపడే ప్రసక్తేలేదని, తమ కూతురును ఇబ్బందులు పెట్టిన భగీరథ్‌కు శిక్ష కోసం న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పినట్టు తెలుస్తున్నది.