కరీంనగర్ రాంనగర్, జూన్ 30 : ప్రేమ పేరుతో ఓ విద్యార్థినిని మోసం చేయడంతోపాటు ఆమెపై లైంగికదాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌పై కరీంనగర్ రూర ల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశా రు. రూరల్ సీఐ నీరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లికి చెందిన ఆటోడ్రైవర్ గనుకుంట్ల మురళీకృష్ణ ఏడాది క్రితం కరీంనగర్ రూరల్ పరిధికి చెందిన ఓ విద్యార్థినితో పరిచ యం పెంచుకున్నాడు. ఆమెను వివా హం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు తన ఇంటికి తీసుకెళ్లాడు. మురళీకృష్ణకు అప్పటికే వివాహం జరిగిన విష యం తెలుసుకున్న బాధిత విద్యార్థిని అతడికి దూరంగా ఉంటున్నది. జూన్ 29న బాధితురాలు కళాశాలకు వెళ్లేందు కు బస్సు కోసం వేచి ఉండగా అటుగా వెళ్లిన మురళీకృష్ణ విద్యార్థిని బలవంతంగా తన వాహనంపై పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వద్ద కు తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్ మురళీకృష్ణపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
చిన్నారిపై లైంగికదాడికి యత్నం ; నిందితుడిపై పోక్సో కేసు
ఖిల్లాఘణపురం, జూన్ 30 : రెండోతరగతి విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించగా పోక్సో కేసు నమోదైన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండోతరగతి చదువుతున్న విద్యార్థినిని సమీపంలో ఉంటు న్న వివాహితుడు శ్రీనివాస్ వచ్చి ఉపాధ్యాయురాలికి చెప్పి తీసుకెళ్లాడు. బయటకు వెళ్లిన చిన్నారి ఎంతకీ రాకపోవడంతో టీచర్ విద్యార్థులను శ్రీనివాస్ ఇంటికి పంపగా ఆ ఇంట్లో ఏడు స్తూ ఉండడాన్ని గుర్తించి విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. విషయం తెలసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. విద్యార్థిని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.