Pocso Case | పోక్సో నిందితుడిని వదిలేసిన పోలీసులు?.. యాదాద్రి జిల్లాలో ఘటన
Pocso Case | పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేయకుండా వదిలేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ బాలిక హైదరాబాద్‌లోని మలక్‌పేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. ఈ నెల 9న అడ్డగూడూరు మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది.
Pocso Case | అడ్డగూడూరు, జూలై 14 : పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేయకుండా వదిలేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ బాలిక హైదరాబాద్‌లోని మలక్‌పేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. ఈ నెల 9న అడ్డగూడూరు మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలెంల చైతన్య అనే యువకుడు బాలిక అమ్మమ్మ ఇంటి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా అమ్మమ్మ గుర్తించి వెంటనే సదరు వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక అమ్మమ్మ ఆరోపించింది. తననే కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేశారని పేర్కొంది.
చట్టపరంగా చర్యలు : ఎస్సై
పోక్సో కేసు నిందితుడిని వదిలేశామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు. బాలిక అమ్మమ్మ ఈ నెల 10న ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని రిమాండ్‌కు పంపడానికి కొంత ప్రొసీజర్ ఉంటుందని తెలిపారు.
ఈ నెల 13న భువనగిరిలోని భరోసా సెంటర్‌కు పిలిచి మహిళా ఎస్త్సె ద్వారా బాలిక స్టేట్మెంట్ రికార్డు చేసి ఆమె చిన్నమ్మ వాళ్ల ఇంటికి పంపించామని తెలిపారు. బాలిక అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు సీసీ టీవీలో రికార్డు అయినట్టు పోలీసులు చెప్పారు. చైతన్య తీసుకెళ్లినట్టు మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదైనట్టు పేర్కొన్నారు. బాలిక, చైతన్య కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

