ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చర జలపాతం జలకళను సంతరించుకున్నది. ఎగువన వానలు కురుస్తుండటంతో జలపాతంలోకి నీరు వస్తున్నది. దీంతో ఎత్తుపైనుంచి పడుతున్న నీటిని చూసి పర్యాటకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ నయాగరా బొగత జలపాతానికి జలకళ వచ్చింది. గలగల పారుతూ 50 అడుగులపై నుంచి కిందకు జాలువారుతున్న జల సవ్వడులతో పర్యాటకులను ఆకట్టుకుం టోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతంలోకి మండలంతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నది.