PMShri | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగా ణ): నేటి నుంచి రాష్ట్రంలోని 74 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ‘పీఎంశ్రీ’ ప్రీ ప్రైమరీ క్లాసు లు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆరేండ్లలోపు పిల్లల కోసం ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతున్నా రు. ప్రైవేట్ పాఠశాలల నుంచి పిల్లల్ని తీసుకురాలేక అంగన్వాడీ పిల్లలను టార్గెట్ చేస్తున్నారు. ఈ మేరకు అంగన్వాడీ టీచర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నా రు. ఇందుకు సంబంధించిన సంఘటన నల్లగొండ జిల్లాలోని వెలిమినేడు ప్రభుత్వ పాఠశాలలో చో టుచేసుకున్నది. అంగన్వాడీ పిల్లలను పీఎంశ్రీ క్లాసులకు పంపిస్తే అంగన్వాడీలు ఉనికి కోల్పోతాయని, అదే జరిగితే తమ భవిష్యత్తు ఏంటని? అంగన్వాడీ టీచర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు నిర్మల ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది.
విచారణ జరుపుతున్నాం..
పీఎంశ్రీ ప్రీ ప్రైమరీ క్లాసుల కోసం పాఠశాలల్లో పిల్లలు లేకపోవడంతో.. అంగన్వాడీ పిల్లలతో తరగతులు బోధించాలని విద్యాశాఖ అంతర్గత నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీనిని ఐసీడీఎస్ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని ఉమె న్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ క్రాంతి వెస్లీ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అంగన్వాడీ పిల్లలను పీఎంశ్రీకి తరలింపు నిర్ణ యం సరికాదని డైరెక్టర్ అభిప్రాయపడ్డారు.