హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకంతోపాటు, మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలను పూర్తిగా రద్దుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐసీడీఎస్ ప్రైవేటీకరణతోపాటు, కేంద్రప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని విమర్శించారు.
పీఎం శ్రీ పథకాన్ని రాష్ట్రంలో 28 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో ప్రారంభించి, మొబైల్ అంగన్వాడీల పేరుతో కొత్త విధానాన్ని తెస్తున్నదని తెలిపారు. దీంతో పేదలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలకు దూరమవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. ఫలితంగా ఐసీడీఎస్ బలహీనపడి మూతపడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. వీరికి రావాల్సిన 10 నెలల వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశావరర్లకు సెలవులు, ఏఎన్సీ, పీఎస్సీ తదితర టార్గెట్ల రద్దు, రిటెర్మైంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు, అన్ని దవాఖానల్లో ఆశాలకు రెస్ట్ రూం ఏర్పాటు, తదితర న్యాయమైన కోరెలను పరిషరించాలని సూచించారు.