MP Santhosh Kumar | ప్రకృతిని కాపాడేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను కొనసాగిస్తాం: ఎంపీ సంతోశ్
పర్యావరణ రక్షణతోపాటు మొక్కలు నాటడం ద్వారా మన ప్రకృతిని కాపాడుకునేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh Kumar) అన్నారు.
హైదరాబాద్: పర్యావరణ రక్షణతోపాటు మొక్కలు నాటడం ద్వారా మన ప్రకృతిని కాపాడుకునేందుకు
గ్రీన్ ఇండియా చాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh Kumar) అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎర్రవల్లిలోని నివాసంలో ఆయన సిల్వర్ ఓక్ మొక్కలను నాటారు. పుట్టిన రోజుతోపాటు సందర్భం ఏదైనా ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని ఆయన కోరారు.
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మానసపుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ స్ఫూర్తితో 2018లో ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. ఒక్కరు మూడు మొక్కలు నాటి, మరో ముగ్గురిని మొక్కలు నాటాల్సిందిగా చాలెంజ్ విసరటమే ఈ కార్యక్రమ స్పూర్తి. ఇది ప్రారంభమైన అనతికాలంలోనే దేశవ్యాప్తంగా ఉద్యమరూపం దాల్చింది. అనేక రంగాల ప్రముఖులను ఏకతాటిపైకి చేర్చి హరిత స్ఫూర్తిని నింపింది గ్రీన్ ఇండియా చాలెంజ్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అస్సాం దాకా నలుదిక్కులకు వ్యాపించింది. మొక్కలు నాటడం, పచ్చదనం పెంచటం ఉద్యమస్పూర్తితో కొనసాగుతున్నది. గత నాలుగేండ్లలో గిన్నిస్ రికార్డుతో పాటు ముక్కోటి వృక్షార్చన, ఊరూరా జమ్మిచెట్టు వంటి వినూత్న కార్యక్రమాలతో కోట్లాది మొక్కలను నాటడం, సంరక్షించటం, అటవీ ప్రాంతాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయటం వంటి కార్యక్రమాలను గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టింది. పుట్టినరోజుతో పాటు ఏ ఇంట ఎలాంటి వేడుక జరిగినా మొక్కనాటి పండగ చేసుకోవటం ఇప్పుడు ఆనవాయితీగా మార్చటంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

