హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు 101వ జయంతిని మంగళవారం రెండు తెలుగు రాష్ర్టాల్లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు.
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ క్లబ్లో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. తెలుగు సినిమాకు ఎన్టీఆర్ గొప్ప స్ఫూర్తి అని, దూరదృష్టి కలిగిన రాజకీయ నాయకుడని ప్రధాని మోదీ ట్వీట్లో కొనియాడారు. ప్రధాని ట్వీట్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించి ఎన్టీఆర్ తెర వెనుక, తెర ముందు ఓ లెజెండ్ అని ట్వీట్ చేశారు. తెలుగు జాతికి సొబగులు అద్దినవారిలో ఎన్టీఆర్ ఒకరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాత ఎన్టీఆర్ తనకు నిత్యస్ఫూర్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.