PM Kusum Scheme | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఏర్పాటుచేసే సోలార్ ప్లాంట్లు పెద్ద కంపెనీలకే దక్కనున్నాయి. ఆ మేరకే నిబంధనలు రూపొందించారన్న విమర్శలొస్తున్నాయి. ఆసక్తి ఉన్న చిన్న కంపెనీలకు మొండిచెయ్యే దక్కనున్నది. ఈ పథకం వెనుక భారీ తతంగం జరిగినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న కంపెనీలున్న తెలంగాణ బిడ్డలకు నష్టం కలిగిచేంలా నిబంధనలు రూపొదించినట్లు సోలార్ ఇంటిగ్రేటర్లు ఆరోపిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 4,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇటీవలే ఇంధనశాఖ అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగా ఇందిరా మహిళాశక్తి పథకం కింద మహిళా సంఘాలకు 1,000 మోగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
డిసెంబర్ 10 వరకు టెండర్లు
పీఎం కుసుమ్ పథకం కింద ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో సంస్థ ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానిస్తున్నది. ప్లాంట్ల డిజైన్, ఉపకరణాల సరఫరా, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, నిర్వహణకు ఆసక్తి గల ఎంప్యానల్మెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) వెండర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది. డిసెంబర్ 10 వరకు టెండర్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది. టెండర్ దక్కించుకున్న సంస్థలు ఏడాదిపాటు ప్లాంట్‌ను నిర్వహించాలి, ప్లాంట్‌కు ఐదేండ్ల గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. టీజీ రెడ్కో విడుదల చేసిన టెండర్ నిబంధనలపైనే తెలంగాణ సోలార్ ఇంటిగ్రేటర్లు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
‘బడా’ నిబంధనలు ఇవే..
నిబంధనలను సరశీకరించాలి
చిన్న కంపెనీల నిర్వాహకులకు రెడ్కో రూపొందించిన నిబంధనలు ప్రతిబంధంగా మారాయి. ఈ నిబంధనలు పెద్ద కంపెనీలకే అనుకూలంగా ఉన్నాయి. రెడ్కో నిబంధనల ప్రకారం తెలంగాణలోని కంపెనీలు అర్హత సాధించలేని పరిస్థితి నెలకొన్నది. నిబంధనలను సరళీకరించాలి. స్థానిక విక్రేతలు, ఎంఎస్ఎంఈ కంపెనీలను ప్రోత్సహించాలి.
– బుర్రా అశోక్‌కుమార్, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసొసియేషన్ అధ్యక్షుడు