కేసముద్రం, ఏప్రిల్ 13 : ‘ఈ-నామ్’ను సమర్థవంతంగా అమలు చేసినందుకు మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైనట్టు మార్కెట్ కార్యదర్శి రాజా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ-నామ్ విజయవంతంగా అమలు చేస్తున్న మార్కెట్లలో 2019-20 సంవత్సరానికి గాను కేసముద్రం, సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్లు పోటీపడగా కేసముద్రం మార్కెట్ ముందువరుసలో నిలిచి అవార్డుకు ఎంపికైందని ఆయన పేర్కొన్నారు. పౌరసేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా మహబూబాబాద్ కలెక్టర్ శశాంక అవార్డుతోపాటు రూ.10 లక్షల నగదు పురస్కారం అందుకోనున్నట్టు ఆయన తెలిపారు.