ఇంటర్న్‌షిప్ చేసిన చోటే ప్లేస్మెంట్.. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడి
రాష్ట్రంలోని విద్యార్థులకు ఒక చేతిలో పట్టా.. మరో చేతిలో ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు.
- రూ.3 వేల కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీల్లో ల్యాబ్‌లు
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యార్థులకు ఒక చేతిలో పట్టా.. మరో చేతిలో ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. స్కిల్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసిన చోటే ప్లేస్మెంట్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 80-90% విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసిన చోటే ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
సోమవారం నాంపల్లిలోని రూసా భవనంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, సీఐఐ ప్రతినిధి సీ శేఖర్‌రెడ్డి, శ్రీకాంత్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆచార్యులు ప్రొఫెసర్ నాగేశ్వర్రావు, ప్రొఫెసర్ ఈ వెంకటేశ్‌తో కలిసి మీడియాతో
పాలిటెక్నిక్, డిగ్రీ కోర్సుల్లో సమూల మార్పులు చేశామని తెలిపారు. మూస పద్ధతులకు గుడ్‌బై చెప్పి.. పరిశ్రమ అవసరాలకు తగిన సిలబస్‌ను తయారుచేశామని, కొత్తగా డిగ్రీలో 11 అప్రెంటిస్‌షిప్ కోర్సులు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడు వేల కోట్లతో ల్యాబ్‌లను నెలకొల్పనున్నామని శ్రీదేవసేన వెల్లడించారు. డిప్లొమాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను దేశంలో ఎక్కడా వినియోగించడంలేదని, తొలిసారిగా ఏఐని ప్రవేశపెట్టామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

