హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు అందుబాటులోకి రానున్నట్టు వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హూజూర్‌నగర్, నిజామాబాద్, కొడంగల్‌లో వ్యవసాయ కళాశాలలను మంజూరు చేసిందని, వీటిలో 30 సీట్ల చొప్పున మొత్తం 90 సీట్లు కేటాయించిందని, వీటి భర్తీకి త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
అదేవిధంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ సహకారంతో టీజీఈపీసెట్-2025లో అర్హత సాధించిన వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మరో 60 సీట్లను ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ప్రవేశాల కోసంug.miptbcwreis.net, pjtau.edu.in వెబ్సైట్లలో ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని వీసీ జానయ్య సూచించారు.