హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ర్టానికి చెందిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనను ఆది, సోమవారాల్లో జరిగిన ఏఐఎఫ్‌టీవో జాతీయ సాధారణ కౌన్సిల్ సమావేశాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు.
2021- 24 వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ను పునరుద్ధరించే వరకు అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఏకంచేసి పోరాడుతామని తెలిపారు. జాతీయ ఉపాధ్యక్షురాలు గీత, జాతీయ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మహిళా కార్యదర్శులు త్రివేణిదేవి, విజయలక్ష్మి, ఆనంద్‌రెడ్డి, రామేశ్వర్, రజిత, జ్యోతి హాజరయ్యారు. ఇక రాష్ర్టానికి చెందిన మరో ఉపాధ్యాయ సంఘం నేత మహమ్మద్ అబ్దుల్లా ఏఐఎఫ్‌టీవో సెక్రటరీగా ఎన్నికయ్యారు.