కీసర, జూలై 8: కీసర ఔటర్ రింగ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ శ్రీకరణ్రెడ్డి (26) మృతి చెందాడు. గజ్వేల్‌కు చెందిన శ్రీకరణ్.. నగరంలోని నేరెడ్‌మెట్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కారులో కీసర మీదుగా ఘట్కేసర్ నుంచి యాదగిరి గుట్టకు బయలుదేరాడు.
కీసర సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు మీద కారు బోల్తా కొట్టి, అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే, కారును ఏదైనా వాహనం ఢీకొట్టిందా? అన్న కోణంలో కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకరణ్.. బ్యాంకాక్‌లో పైలట్ శిక్షణ పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.