ఫూలే జీవితం అందరికీ ఆదర్శంl
అణగారిన వర్గాల ప్రజల హకుల కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబా ఫూలే జీవితం ప్రతి ఒకరికీ ఆదర్శనీయమని, ఆయన జీవన విధానాన్ని అధ్యయనం చేసి ఆచరించాలని మాజీ స్పీకర్, మండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు.
- కులవ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి
- మండలి బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ సిరికొండ
- చిరంజీవులుకు ఫూలే అవార్డు ప్రదానం
హైదరాబాద్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ): అణగారిన వర్గాల ప్రజల హకుల కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబా ఫూలే జీవితం ప్రతి ఒకరికీ ఆదర్శనీయమని, ఆయన జీవన విధానాన్ని అధ్యయనం చేసి ఆచరించాలని మాజీ స్పీకర్, మండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. ఫూలే 199వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఫూలే ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవాన్ని రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ సమాజంలోని అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు ఫూలే విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నేటి యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులుకు ఈ ఏడాది ఫూలే ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేశారు. కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, బీఎస్పీ కన్వీనర్ పూర్ణచందర్రావు, బీసీ పొలిటికల్ ఫ్రెండ్స్ చైర్మన్ బాలరాజ్‌గౌడ్, ప్రోగ్రాం అడ్వైజర్ రవితేజ, గుజ్జ సత్యం, రవీందర్, చంద్ర య్య, మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

