TS High Court | ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ సవాల్ చేశారు. హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా.. దిగువ కోర్టుకి ఇచ్చిందని ఆయన తరఫున న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదన్న ఆరోపించారు. పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని తెలిపారు.
విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దర్యాప్తులోని అంశాలు మీడియాకు లీక్ చేస్తున్నారని.. ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని ప్రణీత్‌రావు న్యాయవాది పేర్కొన్నారు. బంధువులు, న్యాయవాదిని సైతం అనుమతించడం లేదని.. ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డీ రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని కోరగా.. కస్టడీపై పోలీసుల వివరణ కోరుతూ కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.