హైదరాబాద్, జూలై 16 (నమస్తేతెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ మరాఠీ బలరాం పరిశోధనలకు గుర్తింపు దక్కింది. హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిపై ఆవిష్కరణలకు గాను ఫిలిప్పీన్స్ ప్రభుత్వ పేటెంట్ దక్కింది. ఇప్పటికే ఆయనకు భారత్తో పాటు అమెరికా పేటెంట్ హక్కులు లభించాయి.
ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో చేసిన పరిశోధనలకు గాను ఈ గౌరవం దక్కింది. 2036 జూన్ 5వ తేదీ వరకు ఈ పేటెంట్ చెల్లుబాటు అవుతుంది. ఈ ఆవిషరణ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు హైబ్రిడ్ వరి విత్తనాల ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది.